త్వరలో పూనమ్ కౌర్ రాజకీయాల వైపు అడుగు వేయనుందా..?

September 21, 2021 at 7:21 am

కొంతమంది నటులు ఎంతో అందంగా, ప్రతిభ ఉన్నా కూడా హీరోయిన్ గా రాణించలేక పోతుంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా పూనమ్ కౌర్ ఒకరు చెప్పుకోవాలి. ఈమె మొదటి సారిగా మాయాజాలం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లోనే అవకాశాలు బాగా దక్కించుకుంది. హీరోయిన్ పాత్రలు ఎంచుకునే విషయంలో అవగాహన లేకపోవడంతో హీరోయిన్ గా రాణించలేక పోతోంది.

అయితే ఆ మధ్య పవన్ తో బాగా క్లోజ్ ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే పూనమ్ మళ్ళీ ఇప్పుడు చదువు మీద దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఒక వీడియోను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో భాగంగా ఒక నెటిజన్ తనని ఏమి చదువుతున్నారు అని ప్రశ్నించగా.. దానికి ఆమె రిప్లై ఇస్తూ”రాజకీయాలు మరియు పాలసీ మేకింగ్”సంబంధించిన బుక్కులను చదువుతున్నట్లుగా తెలిపింది.

దీంతో కొంత మంది నెటిజన్లు పూనమ్ కౌర్ రాజకీయాల పై ఎక్కువ ఆసక్తి చూపుతోంది అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. అందుచేతనే సమాజంలో జరిగే ఇటువంటి కొన్ని పరిణామాల పై స్పందిస్తుంది అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే భవిష్యత్తులో పూనమ్ కౌర్ ఏ పార్టీ తరుపునుంచి నిలబడుతుందో అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.https://www.instagram.com/p/CT9xbcaqZYh/?utm_source=ig_web_copy_link

 త్వరలో పూనమ్ కౌర్ రాజకీయాల వైపు అడుగు వేయనుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts