వామ్మో..చ‌ర‌ణ్‌కి హాట్‌స్టార్ అంతిస్తుందా?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్‌లో త‌న 15వ మూవీని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Ram Charan to power Disney+Hotstar?

ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సంగ‌తి తెలిసిందే. `మన వినోద విశ్వం` అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే బ్రాండ్ అంబాసిడర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకుగానూ చ‌ర‌ణ్‌కి హాట్ స్టార్ భారీగానే ఇస్తుంద‌ట‌.

Ahead of Disney+'s India Launch, Hotstar Rebranded to Disney+ Hotstar |  Entertainment News

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. సంవ‌త్స‌రానికి రూ.5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వ‌ర‌కు హాట్ స్టార్ నుంచి చ‌ర‌ణ్ రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటున్నాడ‌ట‌. ఏదేమైనా ఒక తెలుగు స్టార్ కి ఈ రేంజ్ లో చెల్లించడమనేది విశేషమనే చెప్పాలి.