బిగ్‌బాస్ స్టేజ్‌పై చ‌ర‌ణ్ ధ‌రించిన జాకెట్‌ ధ‌ర తెలిస్తే షాకే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియ‌ల్ న‌టి ఉమాదేవి బ్యాగ్ స‌ద్ధేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ‌నివారం ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి హోస్ట్ నాగార్జున‌తో, ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.

Ram Charan In Bigg Boss 5: mega power star ram charan on the bigg boss  stage - Bigg Boss ప్రోమో: బిగ్ బాస్ స్టేజ్‌పై రామ్ చరణ్.. నాగ్‌తో కలిసి  సెట్ చేశారు, Watch Video | Samayam Telugu

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో నిన్న‌టి బిగ్ బాస్ షో స్టేజ్‌పైకి వ‌చ్చి తెగ హంగామా చేశారు. అయితే ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ధ‌రించి జాకెట్ అంద‌రినీ ఆక‌ర్షించ‌గా.. ఇప్పుడు దాని ధ‌ర నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Charan's Bigg Boss Jacket Costs Rs 1.3 lakh -

వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. విభిన్నంగా, స్టైల్ గా ఉన్న ఈ జాకెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 1.3 లక్షలు అట‌. డస్ట్ ఆఫ్ గాడ్ సంస్థ ఈ జాకెట్స్ ని తయారు చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ జాకెట్ నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటూ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.