నా ద‌గ్గ‌ర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్ర‌కాశ్‌రాజ్ కామెంట్స్ వైర‌ల్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

When Will Be Polls Held, Asks Prakash Raj

ఆయ‌న మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల కోసం అమలు చేయాల్సిన ముఖ్యమైన అంశాలతో నాకంటూ ఓ ప్రణాళిక ఉంది. ఒకవేళ ‘మా’ సభ్యులు గనుక మిగతా అంశాల కన్నా సొంత భవనమే ముఖ్యమని భావిస్తే విష్ణుగారినే గెలిపిస్తారు` అంటూ త‌న‌శైలిలో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

Prakash Raj in our ring ... Snow Vishnu competing .. Who does he support? - The Post Reader

దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్ లో చేరిపోయారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ నిన్న స్వయంగా వెల్లడించారు.