ప‌వ‌న్ బ‌ర్త్‌డే: మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయ‌న అభిమానుల్లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు.

Watch: Makers of Pawan Kalyan- Rana Daggubati starrer release video from sets | The News Minute

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ హంగామా చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు సిద్ధం అయ్యాయి. మొదటగా చూసుకుంటే పవన్, రానా దగ్గుబాటి కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో చేస్తున్న `భీమ్లా నాయక్` చిత్రం నుంచి ఈ రోజు ఉదయం 11:16 గంటలకు ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుద‌ల కాబోతోంది.

Pawan Kalyan's next titled 'Hari Hara Veera Mallu'

ఆ త‌ర్వాత మధ్యాహ్నాం 1:20 నిమిషాలకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న పీరియాడికల్ మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` నుంచి ఓ అప్డేట్ రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ప‌వ‌న్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి మధ్యాహ్నాం 2:20 నిమిషాలకు అప్డేట్ వ‌స్తుంది. ఇక సాయంత్రం 4:05 నిమిషాలకు ప‌వ‌న్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. మొత్తానికి మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌ల‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఈ రోజంతా జాత‌రే అని చెప్పాలి.