ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు.

 

ఇక ఎన్టీఆర్ కు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టమట. ఎన్టీఆర్ తన చిన్న వయసులో క్రికెట్ ను చూసేవాడిని కానీ ప్రస్తుతం చూసే ఆసక్తి లేదు అని తెలియజేశాడు. ఎన్టీఆర్ చిన్నతనంలో టీవీలో క్రికెట్ను ఎక్కువగా చూసేవారట… ఆ తర్వాత తండ్రి హరికృష్ణ VCR లో రికార్డ్ చేసి మరి చూపించేవారట.అలా మ్యాచ్ ను రెండుసార్లు చూసేవాడట ఎన్టీఆర్.అలా ఒక్క మ్యాచ్ ను రెండు సార్లు చూడడం వల్ల క్రికెట్ మీద ఆసక్తి పోయింది అంటూ తెలియజేశాడు.

క్రికెట్ వస్తే ఎంతసేపైనా చూస్తూ ఉండడంతో.. తన తండ్రి అలా చేసేవాడని చెప్పుకొచ్చాడు.తన తండ్రి ఆ అలవాటును దూరం చేశారు అన్నట్లుగా నవ్వుతూ తెలియజేశాడు ఎన్టీఆర్. ఇక అంతే కాకుండా ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి ఎన్టీఆర్ ఏ హోస్ట్గా రావాలని తన అభిమానులు తెలియజేస్తున్నారట.