మళ్లీ జనతా లుక్‌లోకే మారిన ఎన్టీఆర్‌..పెరిగిపోతున్న అనుమానాలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది.

PHOTOS: Janatha Garage released: Jr NTR, Mohanlal, Nithya Menen, Samantha  Ruth Prabhu, others in spectacular film | The Financial Express| Page 5

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు భీమ్ లుక్‌లో గంభీరంగా క‌నిపించిన ఎన్టీఆర్‌.. ఉన్న‌ట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వరు మీలో కోటీశ్వరులు గేమ్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం విధిత‌మే. అయితే ఈ షో కాస్ట్యూమ్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ అచ్చు జ‌న‌తా లుక్‌లోనే క‌నిపిస్తున్నాడు.

VIJAY NTR FC ?'s tweet - "Our @tarak9999 anna with @Ragavendraraoba garu  at EMK sets !!! #5YearsForBBJanathaGarage " - Trendsmap

వాస్త‌వానికి ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇలాంటి త‌రుణంలో ఎన్టీఆర్ జ‌న‌తా లుక్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అనేక‌ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా కొర‌టాల మూవీలో ఎన్టీఆర్ మ‌ళ్లీ ఆ లుక్‌లోనే క‌లిపిస్తారా లేక జనతా కి గాని సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారా.. అంటూ ప‌లువురు నెటిజ‌న్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.