కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!

September 2, 2021 at 7:57 am

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబ‌ర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇరుకుటుంబ స‌భ్యులు మ‌రియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక‌ జరిగింది.

Upasana's Sister Anushpala To Marry Athlete F1 Car Racer Armaan Ebrahim |  కార్ రేసర్ తో రామ్ చరణ్ మరదలి పెళ్లి.. జంట ఎంత చక్కగా ఉందో చూశారా? -  FilmiBeat Telugu

ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల హాజరై సంద‌డి చేశారు.. అలాగే చెల్లిలి ఎంగేజ్‌మెంట్ ఫంక్ష‌న్‌లో మెగా కోడ‌లు ఉపాస‌న స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం అనుస్పాల-అర్మాన్ ల నిశ్చితార్థ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Upasana Sister Anushpala Kamineni And Armaan Ebrahim Engaged | రేసర్‌తో  ఉపాసన చెల్లెలి ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన మెగాస్టార్ చిరు.. రామ్ చరణ్ రాలేదేంటి

కాగా, మాజీ ఇండియన్‌ ఎఫ్‌ 3 ఛాంపియన్‌ అక్బర్‌ ఇబ్రహీం తనయుడే అర్మన్‌ ఇబ్రహీం. ఇతడు కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్పాల విషయానికొస్తే.. అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు, శోభన- అనిల్‌ కామినేనిల కూతురే అనుష్పాల. ప్ర‌స్తుతంఈమె అపోలో సంస్థల కార్యకలాపాల‌ను ఉపాసనతో క‌లిసి చూసుకుంటోంది.

కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts