`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్‌..వాటిపైనే జ‌క్క‌న్న ప్లాన్స్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film 'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి గుమ్మ‌డికాయ కొట్టేశారు జ‌క్క‌న్న‌. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Team 'RRR' releases festive poster of Ram Charan and Jr NTR on Ugadi | The News Minute

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన‌ప్ప‌టికీ ఇంకా చిన్న రిషూట్స్ బ్యాలెన్స్ ఉన్నాయ‌ట‌. వీటిని జ‌క్క‌న్న వ‌చ్చే వారం తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. కొన్ని సీన్స్ పర్ఫెక్షన్ కోసం ఈ రీషూట్స్ చేయ‌నున్నార‌ని.. వారం రోజుల్లో అవి పూర్తి అవుతాయ‌ని టాక్. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామారాజుగా క‌నిపించ‌నున్నారు.