బిగ్‌బాస్‌-5: కాజల్‌ బండారం బయటపెట్టిన‌ నాగ్‌..అడ్డంగా బుక్కైన బ్యూటీ!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై వారం కావ‌స్తోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్‌ నాగార్జున. వారం రోజులు ఇంటిసభ్యులు ఏం చేశారో చెప్పి ఆటపట్టించాడు నాగ్. ఈ క్ర‌మంలోనే ఆర్జే కాజల్ బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టేశారు. అస‌లు ఏం జ‌రిగిందంటే..

Bigg Boss Telugu: RJ Kajal Trolled For Her Double Standards -

అన్ని విష‌యాల్లోనూ దూరుతూ ఇంటి స‌భ్యులంద‌రికీ టార్గెట్‌గా మారిన కాజ‌ల్‌.. వంటగదిలో ఏ ప‌ని చేయ‌డం లేదు. త‌న‌కు వంట రాద‌ని, అంట్లు తోమ‌న‌ని తెగ ఓవ‌ర్ యాక్ష‌న్ చేసేసింది. `నేను ఎప్పుడు వంట చేయలేదు.. కిచెన్ మొహమే చూడలేదు..ఐ డోంట్ వాంట్ కిచెన్` అని కాజ‌ల్ అన‌డంతో మిగిలిన ఇంటి స‌భ్యులు ఆమెపై ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Bigg Boss 5 Telugu: వీకెండ్ మస్తీ మొదలెట్టిన నాగ్.. కాస్త కనిపించారా అంటూ షణ్ముఖ్‏కు కౌంటర్.. ప్రోమో అదుర్స్.. | Bigg boss 5 telugu weekend promo nagarjuna satirical punch on ...

అయితే వీకెండ్ ఎసిపోడ్‌లో నాగ్ ఈ విష‌యంపై స్పందించారు. కాజల్‌ తనకు వంట రాదన్న విషయాన్ని గుర్తు చేసిన నాగ్‌.. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ వంటకు సంబంధించిన వీడియోలు ఉన్నాయేంటని అనడంతో కాజల్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అవి యూట్యూబ్‌లో చూస్తూ చేసినవని, సొంతంగా రావంటూ కాజ‌ల్‌ కవర్‌ చేసే ప్రయత్నం చేసిన‌ప్ప‌టికీ.. ఇంటి స‌భ్యుల అంద‌రి ముందు అడ్డంగా బుక్కైంది.