బుల్లెట్ బండి పాటకు భారీ ఆఫర్.. అయినా నో చెప్పిందట?

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బుల్లెట్ బండి పాట మార్మోగిపోతోంది.పెళ్లిళ్లకు, చిన్న చిన్న ఫంక్షన్లకు, ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపిస్తోంది. ఇక ఈ పాటకు ఇటీవల ఒక పెళ్లి కూతురు డాన్స్ స్టెప్పులు వేయడంతో ఈ పాట కాస్త మరింత ట్రెండింగ్ అయిపోయింది. ఇక ఈ పెళ్లి కూతురు వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లలో ఇలా ప్రతి ఒక్క చోట షేర్ చేయడంతో ఆ పెళ్ళికూతురు రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయింది.

అయితే ఈ ఫోక్ సాంగ్ కోసం పెద్దపెద్ద అవకాశాలు వస్తున్నప్పటికీ అందుకు మోహనా నో చెబుతోందట.మోహనా భోగరాజు పాడిన ఈ పాటకు లక్ష్మణ్ సాహిత్యాన్ని అందించగా. ఎస్ కే బాజీ సంగీతాన్ని అందించారు. ఈ పాట ఏప్రిల్ లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ పాటకు పెళ్లి కూతురు డాన్స్ వేయడంతో ఈ పాట మరో లెవెల్ కి వెళ్ళింది. ఇప్పటికే కొన్ని మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడే యాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. కానీ అందుకు మోహనా భోగరాజు మాత్రం నో చెబుతోందట. ఎంతో కష్టపడి చేసిన ఈ పాట తమ యూట్యూబ్ ఛానల్ లో ఒక మంచి గుర్తుగా ఉండిపోవాలే కాని ఎవరికీ కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు.