రతన్ టాటా పై ప్రశంసల వర్షం కురిపించిన రష్మి..?

యాంకర్ రష్మి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. రష్మీ యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించింది.ఆమెకి మంచి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అలాగే జంతువులంటే చాలా ఇష్టం. కానీ ఈ మధ్యకాలంలో వెండితెరకు దూరం అయింది. ఎక్కువగా టీవీ షో లలో కనిపిస్తోంది రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. రష్మీ సోషల్ మీడియాలో చేసే కార్యక్రమాలు.. మూగజీవుల మీద ప్రేమ..వంటి సేవా కార్యక్రమాలకు గాను మంచి ప్రశంసలు అందుకుంటోంది.

తరచూ వీధి కుక్కల గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది రష్మీ. వీధి కుక్కలకు ఏర్పడే సమస్యలను స్పందిస్తుంటారు. లాక్ డౌన్ లో అయితే ఆమె వీధి కుక్కల ఆకలి తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగింది. తాజాగా రష్మి ఒక పోస్ట్ పెట్టింది. ఇందులో రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్ విషయం ఉంది.

Ratan Tata's Shout-Out For Taj Employee Who Shared Umbrella With Stray Dog

అదేమిటంటే వర్షాకాలం కావడంతో ఒక ఉద్యోగి రోడ్డు మీద గొడుగు పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. అతని పక్కనే ఓ గొడుగు కింద ఓ వీధి కుక్క కూడా నిల్చుంది. ఆ కుక్కనీ తడుముకుండా.. ఆ కుక్కకు కూడా గొడుగు పట్టి తనతోపాటే తడవకుండా తీసుకొచ్చాడు. ఇంకా ఇలాంటి వారు ఉన్నారంటూ రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్ మీద రష్మీ స్పందించింది. అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి సాధారణ మనుషుల గురించి ఆలోచిస్తున్నారు.. కుక్కల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన్ని ప్రేమిస్తున్నా గౌరవిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.