`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Love Story Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే జుంబా డ్యాన్సర్ రేవంత్ గా నాగచైతన్యను, అత్తెసరు మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనిక గా సాయి పల్లవి ని ట్రైల‌ర్‌లో చూపించారు. అయితే మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని గుర్తించిన రేవంత్.. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు.

Naga Chaitanya-Sai Pallavi's Love Story gets release date | Entertainment  News,The Indian Express

ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడగా.. కులాలు ఆస్తులు అంతస్తుల వల్ల పెద్దలు వీరి ప్రేమకు అడ్డుకోవ‌డాన్ని ట్రైల‌ర్‌లో చూపించారు. మ‌రి రేవంత్‌-మౌనికల‌ ప్రేమాయ‌ణం ఎన్ని మ‌లుపులు తిరిగింది..? చివ‌ర‌కు వీరి ప్రేమ ఫ‌లించిందా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. అయితే సున్నితమైన ప్రేమ కథ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, తెలంగాణ యాస, ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణం ఇవ‌న్నీ ట్రైల‌ర్‌లో చూస్తుంటే మ‌రోసారి `ఫిదా` మూవీని చూస్తున్న‌ట్టే ఉంద‌ని చెప్పాలి.