అర‌రే..కొర‌టాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నం..!

September 13, 2021 at 12:35 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే అనౌన్స్ చేయ‌గా.. జూలైలో సెట్స్ మీద‌కు వెళ్లుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

Koratala Siva makes BIG announcement with Junior NTR, reveals release date of his next

జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్‌కు కేవ‌లం స్టోరీ లైన్ మాత్రం చెప్పి, ఆయ‌న్ను సినిమా చేసేందుకు ఒప్పించిన కొర‌టాల ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి కథా, స్క్రీప్ట్ దేనినీ ఫినిష్ చేయ‌లేక‌పోయార‌ట‌.

NTR 30: Jr NTR is all set to team up with Koratala Siva for his next movie

ఆచార్య సినిమాతో బిజీగా ఉండ‌టం కార‌ణంగా కొర‌టాల‌.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించ‌లేక‌పోయార‌ట‌. ఇక ఇప్పుడిప్పుడే గ్యాప్ దొర‌క‌డంతో కొర‌టాల స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. కొర‌టాల ఎందుకిలా చేశార‌ని.. స్క్రిప్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి కాక‌పోతే, ఇంకెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అర‌రే..కొర‌టాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts