డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్‌స్టోరి. ఏ విషయంలో తెలుసా?

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ లవ్‌స్టోరి కూడా ఒకటి. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ సినిమాను వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినా, ఏపీలో నెలకొన్న టికెట్ ధర వివాదం కారణంగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 13న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాను సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలుపగా, లవ్ స్టోరి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని చిత్ర వర్గాల్లో ఎంతో ఆతృతగా చూస్తున్నాయి. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ చిత్రం తరువాత ఈ సినిమాను తెరకెక్కించడంతో, ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.