జేజమ్మ.. చంద్రముఖి సినిమాలో కనిపిస్తే..?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క తన నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. ఈమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు.

- Advertisement -

ఆ మధ్యన ఒక కుర్ర హీరోతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా అనుష్క ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా.. కోలీవుడ్ వర్గాలు సమాచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే అనుష్క తమిళంలో ఒక భారీ సినిమాలు నటించబోతున్నట్లు గా తెలుస్తోంది. చంద్రముఖి సినిమాకి సీక్వెల్ లో త్వరలో రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లుగా సమాచారం.

Nagavalli #anushkashetty #anushka #anushkafans #nagavalli #chandramukhi |  Most beautiful indian actress, Beautiful indian actress, India beauty women

ఇక ఈ సినిమాని హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నిర్మించబోతున్నట్లుగా సమాచారం.అయితే ఈ సినిమా మా త్వరలోనే ఉండబోతున్నట్లుగా సమాచారం. అనుష్క ఈ సినిమాలో చంద్రముఖి పాత్రను పోషిస్తున్నారు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా అయినా సెట్స్ మీదికి వెళుతుందో లేదో వేచి చూడాల్సిందే..

Share post:

Popular