డ్రగ్స్ కేసులో ఇద్దరికీ సపోర్ట్ చేసిన స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . 2014లో అంతమై పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల మరోసారి టాలీవుడ్
లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది తారలు ఇటీవల ఈడీ ముందు హాజరైనారు. ఇకపోతే ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు.

ఇక్కడ కొంతమంది స్టార్ సెలబ్రిటీలను మరో స్టార్ హీరో సేవ్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన సపోర్ట్ వల్లే ఆ ఇద్దరు స్టార్ ప్రముఖులను ఈడీ అధికారులు విడిచిపెట్టినట్లు వార్తలు తెగ దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన మరికొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా స్టార్ హీరో సపోర్ట్ చేశాడని నిందితులను వదిలి పెడతారా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఆ స్టార్ నటులకు ఎవరు సపోర్ట్ చేశారు అనే విషయం ఇంకా బయటికి పొక్కలేదు.. రహస్యంగానే ఈ డీ అధికారులతో ఈ స్టార్ హీరో మాట్లాడి, వారిని శిక్ష నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకపక్క సెలబ్రిటీలకు కొంతమంది సహాయం చేస్తున్నారు అని కొంతమంది అంటుంటే, ఇంకొంత మంది నిందితులను తప్పిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చివరికి ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూడాల్సిందే