తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. హౌస్‌లో నిలదొక్కుకుని ప్రేక్షకుల మెప్పు పొందేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇక పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఫస్ట్ వీక్‌లో పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. రెండో వారం మాత్రం బాగానే అలరిస్తున్నాడు.
ఇదిలా ఉంటే..తాజాగా షణ్ను గురించి మాట్లాడిన బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ.. అతడి గుట్టంతా బయటపెట్టింది. అయితే పాజిటివ్‌గానే చెప్పుకొచ్చిందిలేండి. విష్ణుప్రియ మాట్లాడుతూ.. మా ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందని, షణ్ముఖ్ చాలా మంచివాడని, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది.
ఎవరూ సపోర్ట్ చేయకున్నా సొంతంగా ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని మెచ్చుకుంది. అతడికి అంతా మంచే జరగాలని పేర్కొంది. అయితే తాను బిగ్‌బాస్ షో చూడనని.. కాబట్టి ఎవరినీ సపోర్ట్ చేయనని షాకిచ్చింది విష్ణు. అంతేకాదు, తనకు బిగ్‌బాస్ కాన్సెస్ట్ నచ్చదని, ఒకవేళ తనకు అవకావం వచ్చినా ఆ షోకు వెళ్లనని కుండబద్ధలు కొట్టింది. అయితే షుణ్ను గురించి విష్ణు మంచిగా చెప్పినందుకు ఆయన ఫ్యాన్స్ హ్యాపీ అయినా.. సపోర్ట్ చేయనన్నందుకు మాత్రం కాస్త హర్ట్ అయ్యారు.