మహేష్ బాబు ఆస్తి విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన ముఖ్యంగా అమ్మాయిల మనసులో దోచే రాజకుమారుడుగా పేరుపొందాడు.ఇప్పటికీ తన వయసు మీద పడుతున్న కూడా ఇంకా కుర్రాడు లాగానే కనిపిస్తున్నాడు మహేష్ బాబు. మొదట రాజకుమారుడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు.

సినీ ఇండస్ట్రీకి అతి చిన్న వయసులో నుంచే తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే అసలు విషయానికి వస్తే మహేష్ బాబు ఎన్ని కోట్లకు అధిపతి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మహేష్ బాబు సంవత్సరానికి 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు సినిమాల ద్వారా సంపాదిస్తాడట. ఇక మహేష్ బాబు పూర్తి ఆస్తి విలువ అక్షరాలా 8000 కోట్ల రూపాయలు ఉన్నట్లు గా సమాచారం. ఇక తన తండ్రి ఆస్తి 2,500 కోట్ల రూపాయలతో పాటు.. తనకి కొన్ని అప్పులు కూడా వచ్చాయి.

మహేష్ బాబు సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ ద్వారా సంవత్సరానికి 185 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తాడు. ఇక శ్రీమంతుడు సినిమాతో ప్రొడ్యూసర్ గా మొదలు పెట్టాడు మహేష్ బాబు. ఇక తన భార్య నమ్రత కూడా మహేష్ కు అదృష్టం అని చెప్పుకోవాలి. నమ్రత తను వచ్చేటప్పుడు 2000 కోట్ల రూపాయల ఆస్తిని తీసుకొని వచ్చింది.మహేష్ కు పద్మాలయ స్టూడియోతో పాటు 80 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంట్లో నివసిస్తున్నాడు.

ఇక హైదరాబాదులో మరొక ఇల్లు, చెన్నైలో కూడా రెండు సొంత ఇల్లు 35 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రత్యేక బస్సులు కూడా కలదు. ఇక ఖరీదైన నాలుగు కార్లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మహేష్ బాబు తన ఆస్తి కంటే తన కూతురు కొడుకు పెద్ద ఆస్తి అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు.