కెప్టెన్ గా తప్పుకున్న విరాట్ కోహ్లీ.. కారణం..?

టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన ఆటతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ప్రస్తుతం ఈయన టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతల నుంచి పాక్షికంగా తప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ విషయాన్ని స్వయంగా త్వరలోనే కోహ్లీనే ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

టి 20 ప్రపంచకప్ అయిపోయిన వెంటనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అన్ని టెస్టు మ్యాచులకు అయితే కోహ్లీ కెప్టెన్ గానే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా కోహ్లీ టీ20 ప్రపంచ కప్ గాని వన్డే ప్రపంచకప్ను గాని సాధించలేకపోయాడు.ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ జట్టుకు తను కెప్టెన్ గా ఉన్నా కూడా ఒక సారి కప్ కూడా గెలవలేక పోయాడు.. అందుచేతనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక కోహ్లీ ఇప్పటి వరకు 50 ఇన్నింగ్స్ ఆడిన ఒక్కసారి కూడా సెంచరీ చేయలేదు. ఇక ఐసిసి ర్యాంకింగ్స్ లో కోహ్లీ బ్యాటింగ్ ర్యాంకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఈ క్రమంలో కోహ్లీ బ్యాటింగ్ పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇక కోహ్లీ విమర్శకుల పాలు కాకముందే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అయితే కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.