నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఫుల్ జోష్‏తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వ‌యంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడ‌ల్ జెస్సీ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు.

Bigg Boss Telugu 5 premiere episode LIVE UPDATES: From Ravi Kiran, Swetaa to Lahari Shari, here's complete list of contestants | Entertainment News,The Indian Express

ఎనిమిదవ కంటెస్టెంట్‏గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, బొమ్మలా ఉండాలి, కేవలం మన క్యాస్టూమ్ కనిపించాలి, మన మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ కనిపించకూడదు అని ఏకంగా కింగ్ నాగార్జునకే ఫ్యాష‌న్ పాఠాలు చెప్పాడు జెస్సీ. ఈ నేప‌థ్యంలోనే అస‌లు జెస్సీ ఎవరు ? ఏం చేస్తుంటాడు ? ఇత‌ని బ్యాక్‌గ్రౌండ్‌ ఎంటీ ? అంటూ నెటిజ‌న్లు గూగుల్‌లో సెర్చ్ చేయ‌డం స్టార్ట్ చేశారు.

Bigg Boss 5 Telugu: Jessie Entered As 8th Contestant In House - Sakshi

అయితే జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే..ఇతనో సూపర్ మోడల్.. ర్యాంప్ వాకర్. ఇప్పటివరకు పలు కార్పొరేట్ యాడ్స్‏లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్న జెస్సీ.. `ఎంత మంచివాడవురా` సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చాడు. ఈ మూవీ తర్వాత ప‌లు సినిమాల్లోనూ.. ప్రకటనల్లోనూ జెస్సీ కనిపించాడు. అంతేకాదు, ఏకధాటిగా 36 గంటలు ర్యాంప్ వాక్ షో చేసి గిన్నిస్ రికార్డ్ సైతం ఎక్కాడు. మ‌రి బిగ్‌బాస్ షో ద్వారా ఈ మోడ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.