హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు గత కొద్ది రోజుల నుంచి..ఈ రాక్షసుడు కోసం వెతుకులాటలోనే ఉన్నారు ప్రజలు. ఇక ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం తనకు తానే శిక్ష విధించుకొన్నాడు నిందితుడు రాజు. ఇక దీంతో ఆ బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఎట్టకేలకు ఈ దుర్మార్గుడు మరణించడంతో రాష్ట్రంలోని ప్రజలకు కొంతమేర ఊరట వచ్చిందని చెప్పుకోవచ్చు.
చిరంజీవి తన ట్వీటర్ ద్వారా ఇలా పోస్ట్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.