సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి అభిమానులు అలాగే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు, అలాగే సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూ లకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన విషయాలను కొందరు పంచుకుంట ఉంటారు. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఒకసారి హీరోయిన్ రెజీనా ను ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు రెజీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.
ఇలా గతంలో హీరోయిన్ రెజీనాను ఓ ఇంటర్వ్యూకు పిలిచిన యాంకర్ ఆమెతో సినిమా గురించి ఎన్నో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ విధంగా సినిమా విశేషాల గురించి ముచ్చటిస్తూ రెజీనా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అనే ప్రశ్నను యాంకర్ వేసింది.ఈ విధంగా ఒక్కసారిగా సదరు యాంకర్ హీరోయిన్ ఆ ప్రశ్న అడగడంతో అందుకు స్పందించిన హీరోయిన్ రెజీనా సదరు యాంకర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందని చెప్పవచ్చు. మా వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ మీ కార్యక్రమాలకు టిఆర్పి రేటింగ్స్ పెంచుకుందాం అనుకుంటున్నారా అంటూ సదరు యాంకర్ పై హీరోయిన్ రెజీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.