`అఖండ‌` కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న బ‌న్నీ.. అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నంద‌మూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎద‌రు చూస్తున్నారు.

Akhanda - Official Trailer | Telugu Movie News - Times of India

అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. భారీ అంచ‌నాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానుల‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నార‌ట‌. అస‌లు అఖండ‌తో బ‌న్నీ సంబంధం ఏంటీ..? ఆయ‌నెందుకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..? అనేగా మీ సందేహం. అక్క‌డకే వ‌స్తున్నా.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చేస్తున్నాడు.

After Akhanda, Boyapati Srinu to work with Allu Arjun? - tollywood

ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను పూర్తి చేసిన వెంట‌నే మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌ని బ‌న్నీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే వేణుశ్రీ‌రామ్‌, బోయ‌పాటి శ్రీ‌నుల‌ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీ అఖండ కోసం ఎదురు చూస్తున్నార‌ట‌. ఈ సినిమా విడుద‌లై హిట్ అందుకుంటే.. బోయ‌పాటితో త‌న నెక్స్ట్‌ను క‌న్ఫార్మ్ చేసేయాల‌ని చూస్తున్నార‌ట‌.