పవన్ లా కాకూడదని నాని వేస్తున్న ప్లాన్..!

ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్ . ఇక ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడం పై ఎప్పటికప్పుడు విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాడు నాని. ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని పలు సార్లు పలు చర్యలు చేపట్టినప్పటికీ, చివరికి నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు నాని . ఇక అందుకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలలో ఒకరైన సాహు గారపాటి తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.

సాహు మాట్లాడుతూ.. థియేటర్ల కోసమే టక్ జగదీష్ సినిమాను రెడీ చేసాము… అందుకోసమే కరోనా రాకముందే ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలనుకుంటే కరోనా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండబోతోంది.. త్వరలోనే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా పడబోతోంది కాబట్టి ఇలాంటి సమయాల్లో థియేటర్లలో విడుదల చేస్తే, ప్రేక్షకులు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. ఆర్థికంగా మాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి.. అందుకే ఇండస్ట్రీ నుంచి సపోర్టు ఉన్నప్పటికీ గిల్డ్ నుంచి సపోర్టు లభించింది. అందుకే ఓటీటీలో విడుదల చేయాలని సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లలో విడుదల చేయాలని విడుదల చేశారు. కానీ సెన్సేషనల్ హిట్ సినిమా కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది . నిర్మాతలకు కూడా నష్టం వచ్చింది.అందుకే వకీల్ సాబ్ సినిమాల కాకూడదని , ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.