బిగ్‌బాస్ 5: ప‌క్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..ర‌ష్మితో ముందే బేర‌సారాలు?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభం కావ‌డానికి మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. సీజ‌న్ 5కి సైతం నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు.

Bigg Boss Telugu 5 gets a new time slot; details inside - Times of India

బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో న‌టుడు విశ్వ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు. సీజ‌న్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో విశ్వ పేరు మొద‌టి నుంచీ బ‌లంగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈయ‌న హౌస్‌లోకి వెళ్ల‌డానికి ముందే యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌తో బేర‌సారాలు చేశాడు. మొన్నీ మ‌ధ్య విశ్వ యాంకర్ రష్మీతో లైవ్‌లోకి వచ్చి.. తన పాత పరిచయాలను బయటకు తీశారు.

actor vishwa: Bigg Boss 5 Telugu : పక్కా ప్లాన్‌గా రష్మీతో బేరం!.. గెలిచేందుకు 'విశ్వ'ప్రయత్నం - actor vishwa deals with rashmi gautam for bigg boss 5 telugu | Samayam Telugu

`యువ` సీరియల్ సమయంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఇద్ద‌రూ గుర్తు చేసుకున్నారు. అలాగే రష్మీ అభిమానుల మెప్పు పొందేందుకు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపించాడు విశ్వ‌. అంతేకాదు, నీ ఫ్యాన్స్ అంద‌రినీ కూడా నన్ను ఫాలో అవ్వమని చెప్పొచ్చు కదా అంటూ ర‌ష్మిని డైరెక్ట్ అడిగేశాడు విశ్వ‌. ఇక వీరిద్ద‌రి లైవ్ చాట్‌ను చూస్తుంటే.. ర‌ష్మి ఖ‌చ్చితంగా విశ్వ‌నే స‌పోర్ట్ చేసేలా క‌నిపిస్తోంది. ఇక ర‌ష్మి స‌పోర్ట్ చేస్తే ఆమె ఫ్యాన్స్ సైతం ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ప‌లుకుతారు. మొత్తానికి ప‌క్కా ప్లానింగ్‌తో హౌస్‌లోకి వెళ్తున్న విశ్వ సీజ‌న్ 5 టైటిల్ గెలుస్తాడో లేదో చూడాలి.

https://www.instagram.com/tv/CTUgjZppXYU/?utm_source=ig_web_copy_link