సన్నగా ఉన్న ఆవిడకి కొవ్వు ఎక్కువ.. బిగ్ బాస్ నటిపై బాబు గోగినేని కామెంట్స్!

ఈ మధ్యకాలంలో పలువురు మంచి హోదాలో ఉన్న సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం తెగించి మరీ ఎదుటి వ్యక్తులని హింసించేలా మాట్లాడి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీ లో నుంచి దళితులను తరిమేయాలి అంటూ దళిత సోదరులపై సిగ్గు లేని వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి బిగ్బాస్ ఫేమ్ మీరా మిథున్. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే ఇలా దళితులపై సిగ్గు లేని వ్యాఖ్యలు చేసినందున ఆమెపై పలురకాల సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఇక ఈ వ్యవహారంపై కొంచెం ఘాటుగా స్పందించారు తెలుగు బిగ్ బాస్ సేమ్ బాబు గోగినేని. మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆమె చూడటానికి సన్నగా ఉన్నా కొవ్వు కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. నాలుగేళ్ల క్రితం ఇలానే వాడినప్పుడు ఆమె బ్రతికిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం బుద్ధి వచ్చేలా శిక్షించాలి అంటూ సీరియస్ అయ్యారు బాబు గోగినేని. ఇంతకుముందు ఒక దళిత యువకుడికీ నిర్బంధం శిరోముండనం చేయించి జైలుకు వెళ్ళిన ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నూతన్ నాయుడు ని ఏకిపారేశారు బాబు గోగినేని.