సుడిగాలి సుధీర్ పెళ్లి సీక్రెట్ లీక్.. ఏమిటంటే?

సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర స్టార్ కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, నటుడిగా ఇలా ఒక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇటు బుల్లితెర పైనే కాకుండా అటు వెండి తెరపై కూడా హీరోగా నటించి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు రకాల షోలతో బిజీగా ఉన్నారు సుధీర్. ఢీ, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లలో నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే మరొకసారి సుధీర్ పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. ఈ షోలో సుడిగాలి సుధీర్ అక్క పాల్గొని సుధీర్ గురించి పలు విషయాలను తెలిపింది. సుధీర్ కి తన అక్క కీ మధ్య ఒక సంవత్సరం మాత్రమే గ్యాప్ ఉందని, అక్క తమ్ముడు కంటే ఎక్కువగా స్నేహితులుగా ఉంటామని, అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం అని తెలిపింది. అప్పుడు ఈ విషయంపై స్పందించిన శీను అన్ని విషయాలు చేసుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి అని అనగా నాకు తెలుసు నీకు కూడా చెబుతా అని ఆమె సమాధానం ఇచ్చింది. ఇక ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే వీడి పెళ్లి కోసం అక్క మూడుసార్లు కెనడా నుంచి వచ్చింది. ఆ ఛార్జి డబ్బులతో వీడికి మూడు పెళ్లిళ్లు అయ్యేవి అంటూ రాంప్రసాద్ సుధీర్ పై సెటైర్ వేసాడు.