హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ పాత్ర ఏంటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా హరిహర వీరమల్లు సినిమా రూపొందుతోంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే హీరోయిన్లుగా ఒకరు నిధి అగర్వాల్ మరొకరు జాక్వలైన్ ఫెర్నాండేజ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ చీరకట్టులో సాంప్రదాయమైన చిత్రకారిణి గా కనిపిస్తుంది. ఇందులో నిధి అగర్వాల్ పాత్ర పేరు పంచమి. అయితే ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా లోని నిధి అగర్వాల్ పాత్ర లుక్ విడుదల చేయడం జరిగింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిధి అగర్వాల్ విషయానికి వస్తే ఈమె నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆపై రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నటించింది. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారింది. అలాగే ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందాల ఆరబోతతో, వరుసగా గ్లామర్ ఫోటో షూట్ లు కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.