ధన్ రాజ్, సునీల్ సినిమా కోసం కదిలి వచ్చిన ప్రభాస్ హీరోయిన్..!

జబర్దస్త్ ప్రోగ్రాం లో చాలా బాగా సందడి చేస్తూ కామెడీ లను చేస్తూ మనసును దోచుకున్న మన ధనాధన్ ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.. ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయితే కొన్ని సినిమాలకు నిర్మాతగా చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ధన్ రాజ్ తను నటించిన సినిమాలలో కూడా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయాడు.కానీ కమెడియన్ గా , నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చిత్రసీమలో గాని బుల్లితెరపై కానీ ధనరాజ్ కు మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమాతో ధనరాజ్ ,సునీల్ కలిసి హీరోలుగా నటించబోతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూన్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ బుజ్జి ఇలా రా అనే సినిమాలో నటించబోతున్నారు. ఇది సోషల్ మీడియాలో మంచి హైలెట్ గా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ పోస్టర్లలో ధన్ రాజ్ లుక్ ను చూపించారు. ఈ సినిమాలో కొత్త లుక్ తో,ఒక సీ ఐ వేషం తో చూడబోతున్నారు. ఈ సినిమాలో పాత్ర పేరు కేశవ నాయుడుగా రానున్నాడు.

బుజ్జి ఇలా రా అనే సినిమాకు గరుడ వేగా అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అనుకుంటున్నారట. ఈ సినిమాకు నిర్మాతగా నాగిరెడ్డి సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాకి దర్శకుడిగా జి. నాగేశ్వర రెడ్డి కథ, స్క్రీన్ప్లే జత చేస్తున్నాడు.

 

ధనరాజ్ సినిమాలో నోరా ఫతేహి హీరోయిన్ గా నటించబోతున్నారు. మన యంగ్ రెబెల్ సినిమా ద్వారా తెరకెక్కిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు త్వరలోనే స్పందించనుంది. ధనరాజ్ ని ఈ కొత్త లుక్ లో చూసిన ప్రేక్షకులు అందరూ ఆల్ ద బెస్ట్ అని చెబుతున్నారట.వీరి మాటలకు ధన్ రాజ్ ఎమోషన్ కి గురయ్యాడు. ఎందుకంటే ఎన్నో విషెస్ వచ్చినా, అన్నిటికంటే ప్రేక్షకుల నుంచి వచ్చిన విషెస్.. ప్రత్యేకమైన విషెస్ అని ధనరాజ్ అంటున్నాడట. ఈసారైనా ఈ సినిమాలో పెద్ద సక్సెస్ ను సాధిస్తాడని ప్రేక్షకులు కోరుతున్నారు.