విశ్వక్ సేన్ అస‌లు పేరేంటీ..ఎందుకు దానిని మార్చుకున్నాడు?

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వ‌క్ సేన్ ఒక‌డు. ద‌ర్శ‌కుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎవ‌రికీ తెలుదు. ఆ త‌ర్వాత `ఈ నగరానికి ఏమైంది` మూవీలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్ ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్ వంటి చిత్రాల‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.

Vishwak Sen Reveals His Original Name

ఇక ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `పాగ‌ల్‌` అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మొద‌టి రోజు బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టినా.. ఆ త‌ర్వాత డ‌ల్ అయిపోయింది. అయితే ఈ సినిమా ప్రిరిలీజ్‌ వేడుకలో విశ్వక్‌ సేన్‌..పాగ‌ల్‌తో హిట్ కొడ‌తాన‌ని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటాన‌ని ఓపెన్‌గానే ఛాలెంజ్ చేశాడు.

Vishwak Sen Age, Height, Weight, Body, Wife or Husband, Caste, Religion,  Net Worth, Assets, Salary, Family, Affairs, Wiki, Biography, Movies, Shows,  Photos, Videos and More

ఈ నేప‌థ్యంలోనే విశ్వ‌క్ సేన్ అస‌లు పేరేంటి..? ఈయ‌న ఎక్క‌డ నుంచి వ‌చ్చాడు..? అన్న విష‌యాలు నెటిజ‌న్లు సెర్చ్ చేయ‌డం స్టార్ట్ చేశారు. అయితే ఈ యంగ్ హీరో రియ‌ల్ నేమ్ దినేష్ నాయుడు. కానీ, ఆ పేరు బాగోక పోవ‌డంతో సినిమా కోసం విశ్వక్ సేన్ అని మార్చుకున్నాడు. ఈ పేరు బాగానే కలిసొచ్చింది కూడా. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విశ్వ‌క్ పుట్టి పెరిగింది హైద‌రాబాద్‌లోనే.