షాకింగ్ న్యూస్.. అక్కడ మళ్ళీ థియేటర్లు బంద్..?

ప్రపంచ దేశాల ప్రజలందరినీ మహమ్మారి కరోనా విడిచి పెట్టేలా కనిపించడం లేదు. ఇప్పట్లో మళ్లీ కరోనా పుట్టుకురావడం అందరిలో భయాన్ని పుట్టిస్తోంది.. మరోసారి సినిమా థియేటర్లు బంద్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొదట థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్కడ థియేటర్లు రన్ అవుతూ వచ్చాయి. కానీ 50% ఆక్యుపెన్సీ తో రన్ అయినా, కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేమికులకు ఇది నిరాశ పరిచే వార్త చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల్లో మరియు మహారాష్ట్రలో థియేటర్లో మూత పడతాయేమో అన్న సమాచారం అందింది.

 

కొన్ని రాష్ట్రాలలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కేరళలో కరోనా కేసులు పునరుద్ధరణ చెందుతున్నాయి. మహారాష్ట్ర ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన అక్కడున్న ఆరోగ్యశాఖ మంత్రులతో చర్చించి , కరోనాను అరికట్టాలని మార్గదర్శకాలను జారీ చేస్తున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్స్ తో మాల్స్ , జిమ్ సెంటర్లు వంటివి తెరుస్తారు. ఉదయం 9:45 నిముషాల తర్వాత తెరవడానికి వాటికి అనుమతులు ఇచ్చారు. హోటళ్ళు మాత్రం మళ్లీ మూతపడుతున్నాయి. కొన్ని ప్రైవేటు కార్యాలయాలు 24 అవర్స్ పని చేస్తాయట.

గతంలో కూడా ముంబాయి,కేరళలో కరోనా కేసులు పెరిగి తరువాత తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరగటం మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టె అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమా థియేటర్లు మూసివేయడంతో తెలుగు సినీ దర్శక నిర్మాతల లో మళ్లీ అలజడి మొదలైందని .ఇకపోతే తెలంగాణలో 70 శాతం థియేటర్లు ఆక్యుపెన్సీ తో స్టార్ట్ అవుతున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ లో 50% ఆక్యూపెన్స్ తో ఓపెన్ అవడానికి తయారవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లో అసలు ఓపెన్ కాలేదు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు కరోనాతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నాయి.ఇక అలాంటప్పుడు థియేటర్లు ఓపెన్ కావటానికి కొద్దిగా టైం పట్టొచ్చు.