సెప్టెంబర్ 1 నుంచి రాబోతున్న మార్పులు ఇవే. ..!

కొత్త నెల ప్రారంభం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆలోచనలో పడతారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ పెరుగుదలతోనే సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో ఎటువంటి కొత్త కొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయో ఆ మార్పులు మన జీవితంలో ఎటువంటి మార్పులు కారణం అవుతాయో తెలుసుకుందామా. ! ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్‌ అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునే గడువు ముగియనుంది. ఆ తరువాత అంటే సెప్టెంబర్ 1తేదీ నుంచి ఆధార్‌ లింక్ చేసిన పీఎఫ్‌ అకౌంట్‌లలో మాత్రమే డబ్బులు క్రెడిట్ అవుతాయి.

అలాగే రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈ సంవత్సరం అమలులోకి తెచ్చిన ‘పాజిటివిటీ పే సిస్టం’ను యాక్సిస్‌ బ్యాంక్ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి తెస్తామని ప్రకటించింది.పోజిటివిటి పే సిస్టం ప్రకారం 50,000 లేదా అంతకంటే ఎక్కువ డబ్బులను చెక్ రూపంలో జారీ చేసే ముందు ఒకసారి బ్యాంకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా చేయకోపోతే చెక్స్ బౌన్స్ అవుతాయి.ఇకపోతే గ్యాస్ ధర గురించి ఊహించుకుంటే చాలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఒక్కో వంటగ్యాస్‌ సిలిండర్‌పై నెల నెల కు 25 రూపాయిల చొప్పున పెరిగిపోతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నెలలో కూడా మళ్ళీ గ్యాస్ ధరలు పెరగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎస్‌బీఐ బ్యాంకు తమ కస్టమర్లను సెప్టెంబరు 30 నాటికి ఆధార్‌-పాన్ కార్డులను లింక్ చేయాలని తెలిపింది. ఒకవేళ చేయకపోతే అలాంటి కస్టమర్స్ ఒకే రోజులో రూ.50 వేలకు పైగా డబ్బులను ఖాతాలో డిపాజిట్‌ చేయాలేరు. అలాగే సెప్టెంబర్ నుంచి జీఎస్టీఆర్‌ ఫైలింగ్‌లో కేంద్ర జీఎస్టీ నియమాల్లోని రూల్‌-59 ప్రకారం గత ట్యాక్స్ పీరియడ్‌లో ఫారం జీఎస్టీఆర్‌-3బీలో రిటర్న్‌ దాఖలు చేయకపోతే వారు రానున్న రోజుల్లో జీఎస్టీఆర్‌-1ని ఫైల్‌ చేయడానికి కూడా వీలుపడదు.