గోపీచంద్‌ ” సీటిమార్‌” రిలీస్ డేట్ ఖరారు…!

తెలుగు సినిమా ఇండస్ట్రిలో హీరో గోపీచంద్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిత్యం  ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో గోపీచంద్‌. అయితే తన ఇండస్ట్రి లైఫ్ లో  మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో అలరించేయందుకు సిద్దం అవుతున్నాడు.

 

ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా  నటిస్తున్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా ప్రేక్షకుల ముందు  కనిపించనున్నారు. ఈ సినిమాను  వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా అందుకు  సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇక  సంపత్‌నంది, గోపీచంద్‌ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి పాత్రలో కనిపిచబోతుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై నిర్మిస్తున్నరు చిత్రా బృందం. అలాగే ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావు రమేశ్‌, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా గోపి చంద్ కు విజయం అందిస్తుందో లేదో.