నాగార్జున బ‌ర్త్‌డే..స‌మంత ట్వీట్‌తో ఆ పుకార్ల‌కు చెక్‌!!

అక్కినేని వారి కోడ‌లు, అగ్ర హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది.

Akkineni Nagarjuna reveals Samantha Ruth Prabhu's reaction to Ra Randoi Veduka Chuddam trailer | India.com

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా అకౌంట్‌కు స‌మంత త‌న పేరులో అక్కినేని తొల‌గించి కేవ‌లం `ఎస్` అనే లెట‌ర్‌ని పెట్టుకున్న విష‌యం తెలిసిందే. దాంతో ఈ విషయమై బోలెడ‌న్ని పుకార్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా కొంద‌రు అత్తామామ‌లైన అమ‌ల‌, నాగార్జున‌ల‌తో స‌మంత‌కు విభేదాలు వ‌చ్చాయ‌ని క‌థ‌లు క‌థ‌లుగా రాశారు.

Samantha to star opposite Nagarjuna in Raju Gari Gadi 2 - Movies News

అయితే ఈ క‌థ‌లు కేవ‌లం పుకార్లే అని తాజాగా ఒక్క ట్వీట్‌తో స‌మంత తేల్చేసింది. ఈ రోజు కింగ్ నాగార్జున బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా మామ‌కు స‌మంత ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పెష‌ల్ విషెస్ తెలిపింది. `మీ ప‌ట్ల నా గౌర‌వాన్ని వ‌ర్ణించ‌డానికి ప‌దాలు లేవు. ఈ రోజు,ఎల్ల‌ప్పుడు మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మామ` అంటూ ట్వీట్ చేసి పుకార్త‌కు చెక్ పెట్టింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1431827229525168128?s=20