ది గోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల.. మామూలుగా లేదుగా?

ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో పోటీపడుతూ మరీ సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కాకపోతే ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల కొద్దిరోజులు ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్టారు. అయితే నేడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ను కూడా రివీల్ చేశారు.

ఈ సినిమా ది గోస్ట్ అనే టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ ఫస్ట్ లుక్ లో చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్లుగా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఆత్మకూరు రూపొందుతోంది . ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు.