భార‌త్‌లో మ‌ళ్లీ 40 వేల‌కుపైగా క‌రోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే గ‌త ఐదు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతుండ‌డంతో.. ప్ర‌జ‌ల్లో తీవ్ర క‌ల‌వ‌రం మొద‌లైంది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 45,083 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,95,030 కు చేరుకుంది. అలాగే నిన్న 460 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,37,830 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 35,840 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,18,88,642 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,68,558 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 17,55,327 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.