ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం.. మళ్లీ అదే సమస్య?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ తో రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవడంతో ప్రేక్షకులు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. చివరికి అక్టోబర్ 13వ తేదీ రిలీజ్ అవుతుందని ప్రకటించిన దానిపై పూర్తి సమాచారం ఇప్పటి వరకు రాలేదు.

ఈ సినిమా చిత్ర బృందం ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా దసరాకి రిలీజ్ చేయకుండా బరిలో నుంచి తప్పుకుంటేఆచార్య, అఖండ , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదల తేదీలను ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే త్రిబుల్ ఆర్ టీమ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం మీకు మీరే.. మాకు మేమే అన్న ధోరణి మంచిది కాదని కొందరు వాదన వినిపిస్తున్నారు. అయితే త్వరలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విడుదల తేదీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.