రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!

యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, అందుకే ఉక్రెయిన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్, తిరిగి వచ్చాక కూడా కొంతమేర బ్యాలెన్స్ షూటింగ్ చేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి ఎంత క్లారిటీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రతీ అంశం పక్కాగా వచ్చే వరకు ఆయన ససేమిరా అంటారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా దసరాకు రావడం డౌటే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. అయితే ఆర్ఆర్ఆర్ దసరాకు రాకపోవడం చాలా మంచిదని అంటున్నాడు మరో స్టార్ హీరో.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య ఒక్క పాట మినహా సినిమా పూర్తయ్యిందనే విషయం తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ దసరా రేసు నుండి బయటపడితే ఆ ఛాన్స్‌ను ఆచార్య పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది. మరి ఆచార్య ఆశలపై ఆర్ఆర్ఆర్ నీళ్లు జల్లుతుందా లేక దసరా రేసు నుండి పక్కకు జరిగి సీనియర్ హీరోకు ఛాన్స్ ఇస్తుందా అనేది చూడాలి.