అమలాపాల్ తల్లిదండ్రుల గురించి తెలుసా..?

తెలుగులో రామ్ చరణ్, అల్లుఅర్జున్ తో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అమలాపాల్ , స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె తమిళంలో కూడా బాగానే ఆఫర్లు పొందుతున్నది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈమె కేరళలో జన్మించింది. ఇక ఈమె కన్నడ , మలయాళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అమలాపాల్ 2009వ సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న సమయంలో షార్ట్ ఫిలిం లోకిన్అవకాశం రావడం వల్ల ఆమె నటించింది. అలా అడుగుపెట్టిన ఈమె తెలుగులో నాయక్ సినిమా తప్ప మరే సినిమాలో సక్సెస్ కాలేకపోయింది. ఇక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో.. అనుకోకుండా కొన్ని కారణాల చేత తన భర్త దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో విడాకులు తీసుకున్నది.

2014 సంవత్సరంలో ఏఎల్ విజయ్ తో వివాహం జరగగా.. తిరిగి మూడు సంవత్సరాలలోనే వారు విడిపోయారు. ఇక దర్శకుడు విజయ్ ఆ తర్వాత మరొక పెళ్లి చేసుకున్న, అమలాపాల్ మాత్రం పెళ్లి చేసుకోకుండా తన తండ్రి డిపార్ట్మెంట్ లో ఉద్యోగి గా పని చేస్తోంది. ఇక అంతే కాకుండా అమలాపాల్ తల్లి ఒక గాయని కూడా.

తన అన్న అభిజిత్ సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చి, అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అమలాపాల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆమె సినిమాల్లోకి వెళ్లవద్దని తల్లిదండ్రులు చెప్పినా, తన అన్న ప్రోత్సాహంతో అమలాపాల్ సినిమాల వైపు అడుగులు వేసింది.