ఎన్టీఆర్‌ త‌ల‌కు తీవ్ర గాయం..సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన‌ ఆర్ఆర్ఆర్ టీమ్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుంది.

Rajamouli's RRR gets a release date | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే.. షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్‌ త‌ల‌కు ఓవైపు తీవ్ర గాయం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇది గ‌మ‌నించిన ఫ్యాన్స్‌.. త‌మ‌ అభిమాన హీరో ఎన్టీఆర్‌ కి ఏమైంది అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ల వ‌ర్షం కురిపించారు.

NTR: ఎన్టీఆర్ నుదిటి పై ఆ దెబ్బ ఏంటి..? టెన్షన్ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ |  The News Qube

ఇక అభిమానుల కంగారు తెలుసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌.. సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చింది. అస‌లు ఎన్టీఆర్‌కు గాయ‌మే అవ్వ‌లేద‌ని.. షూట్ కోసం అలా మేక‌ప్ వేశార‌ని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చింది. దాంతో తార‌క్ అభిమానులు కాస్త శాంతించారు.

https://twitter.com/RRRMovie/status/1423993412131246082?s=20