పంజాబ్ హాకీ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

టోక్యో 2020 ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు ప్రతిభ కనపరిచింది. ప్రతిష్టాత్మకంగా హాకీ విభాగంలో పురుషుల టీం ఘనత సాధించిందని చెప్పవచ్చు. గత 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, ఇప్పుడు ఒలంపిక్స్లో పురుషుల హాకీ విభాగంలో మొదటిసారిగా పతకం సాధించింది. హాకీ పోటీలలో భారత్ 5 – 4 తేడాతో అత్యంత బలమైన జర్మనీ టీంను చిత్తు చిత్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారతావని ఆనందంలో తులతూగు తోంది. ఇక భారత్ లో కీర్తి పతాకం రెపరెపలాడింది. 1980వ సంవత్సరం తర్వాత మొదటి సారిగా ఒలంపిక్స్లో ఈ పథకాన్ని సాధించడం భారత్ కు గర్వకారణం అని చెప్పవచ్చు.

మ్యాచ్ లో 2, 3 క్వార్టర్స్ లో భారత స్ట్రైకర్ లు తమ సత్తా చూపగా, ఇక చివరి క్వార్టర్లో జర్మనీ క్రీడాకారులు చలాకీగా ఆడినప్పటికీ, డిఫెండర్ లు గోల్కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. అంతే కాదు పలు పెనాల్టీ కార్నర్ లను గోల్ కాకుండా అడ్డుపడి, ఒలంపిక్ పతకాన్ని ఒడిసి పట్టారు. ఇక హాకీ విభాగంలో ఒలింపిక్స్లో భారత్ 12 పథకాలను ఇప్పటివరకు గెలుచుకోగా, జపాన్ నుండి భారత్ రెండో పతకం గెలుపొందడం విశేషం. ఇక హాకీలో రెండు గోల్స్ తో భారత విజయంలో సిమ్రన్ జీత్ కీలక పాత్ర పోషించాడు.

ఇకపోతే ప్రస్తుతం పంజాబ్, హర్యానాల్లో ఉన్న ఈ ఆటగాళ్లు ఇళ్ళ వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక భారత ఖ్యాతిని , సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పెంపొందించిన అందుకుగాను, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది . ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్ర క్రీడా మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోది ఈ విషయాన్ని ప్రకటించారు.

మొదటిసారిగా భారత హాకీ జట్టు లో ఎనిమిది మంది పంజాబీ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, హార్దిక్ సింగ్, సన్షీర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జత్ సింగ్, మన్ప్రీత్ సింగ్ పంజాబ్ కు చెందిన వారు కావడం గమనార్హం. ఇక వీరందరూ స్వర్ణపతకం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని మొదట ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, మూడవ స్థానంలో కాంస్య పథకం తీసుకురావడంతో కోటి రూపాయలను ఇవ్వనుంది.