ఓటీటీలో పరుగులు పెడుతున్న భారీ బడ్జెట్ చిత్రాలు..

కరోనా సమయంలో చాలామంది నిర్మాతలు తమ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు వినోదం అంతా ఓటీటీలోనే సాగిపోతోంది. అందుకే చాలామంది భవిష్యత్తులో కూడా ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ పెద్ద ప్లాట్ఫాం గా మారబోతుంది అన్న కారణంతోనే , నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సారి ఓటీటీ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కూడా పోటీపడుతూ, ఎక్కువ లాభాలను ఆశించకుండా వచ్చిన లాభం తోనే సరిపెట్టుకోవాలి అనుకోవడం గమనార్హం..

స్వాతంత్ర దినోత్సవ వారంలో ఏకంగా నాలుగు పెద్ద చిత్రాలను ఓటీటీ వేదికగా వివిధ ప్లాట్ ఫామ్ లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. రెండు బాలీవుడ్ సినిమాలు అవి భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, మరొక సినిమా షేర్షా, ఈ వారం చివర్లో విడుదల కాబోతున్నాయి. ఇక అంతే కాదు నయనతార నటిస్తున్న తమిళ చిత్రం నేత్రికన్, అలాగే మలయాళం సినిమా కురుతి సినిమాలు కూడా ఈ వారం చివర్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇక నయనతార ప్రధాన పాత్రలో నటించబోతోన్న నేత్రికన్ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇందులో ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే మూవీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నయనతార ఒక గుడ్డి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఆమె పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ నిర్మాత విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి నిర్మాత. ఇక దర్శకుడు మిలింద రావు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 13వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

మలయాళం చిత్రం కురుతి కూడా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. ఇక ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది.భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఈ సినిమా కూడా ఆగస్టు 13వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. షేర్షా కూడా ఆగస్టు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.