ఎన్టీఆర్ పై ఘాటుగా కామెంట్స్ చేసిన సుదీప్.. మరీ ఇంత దారుణమా..?

నందమూరి తారక రత్న వారసుడిగా, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్రవేసుకోవడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన మొదట సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి, ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఎన్టీఆర్ కు కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కు అభిమానులే. సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ,రోజురోజుకీ ఎన్టీఆర్ ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. అంతేకాదు ఇటీవల ఒక ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ హీరో కూడా టాలీవుడ్ లో అత్యధికంగా తనకు నచ్చే హీరో ఎన్టీఆర్ అని కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు..

ఇటీవల కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఎన్టీఆర్ పై ఘాటుగా కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది. అంతేకాదు సుదీప్ మాట్లాడుతూ..” టాలీవుడ్ లో నాకు అత్యధికంగా ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ మాత్రమే. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ కష్టపడే తీరు ఎవరినైనా ఇట్టే ఫ్యాన్ ను చేస్తుంది. ఇక తన డాన్స్ తో అందరినీ ఆకర్షించడమే కాకుండా అద్భుతంగా నటిస్తాడు కూడా. ముఖ్యంగా ఆయనతో ఎవరైతే కలిసి నటిస్తారో , వారికి కూడా ఒక గొప్ప అనుభూతి ని పొందుతారు..

చబ్బీ చబ్బీ గా కనిపించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఫిజిక్ మెయింటైన్ చేస్తూ భీమ్ పాత్రతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.. తప్పకుండా ఈ సినిమాలో భీమ్ పాత్ర ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది.. తప్పకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ ఎదుగుతాడు” అంటూ సుదీప్ చెప్పుకొచ్చాడు.

Share post:

Latest