“నేనే నా” సినిమా నుండి న్యూ పోస్టర్ విడుదల..!

August 18, 2021 at 2:42 pm

సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా నేనే నా.. ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను నిను వీడని నీడను నేనే అనే సస్పెన్స్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో రేజిని ఒక మిస్టరీని కనిపెట్టే పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. అలాగే రీసెంట్ గా విడుదల అయిన పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది.ఇకపొతే ఈ సినిమా ట్రైలర్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం చెప్పారు. అలాగే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని గోకుల్ బెనాయ్ అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది.ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకుంది.

“నేనే నా” సినిమా నుండి న్యూ పోస్టర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts