మన పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఖచ్చితంగా ఉండనే ఇక అందులోని సిం కార్డ్ కంపల్సరిగా ఉండాల్సిందే.కారణాలు ఏవైనా కావచ్చు మనకు తెలియకుండానే చాలా నెంబర్లు తీసుకొని ఉంటాం. అలా తీసుకున్న నెంబర్లను మనం మర్చిపోతూ ఉంటాం.అంతే కాదు మన పేరు మీద కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో విన్నాము మనం.మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయో వాటి గురించి ఇప్పుడు ఈ వివరాలను తెలుసుకుందాం.

 

మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాంశాఖ అందుబాటులోకి తెచ్చింది. మన ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ బటన్ మీద పుట్టి నట్లయితే.. మనకు మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి ఒక లిస్టు ప్రకారం కనిపిస్తుంది. అప్పుడు మనం వాడని మొబైల్ నెంబర్ ఉంటే అక్కడ టిక్ మార్కు చేసి డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల ఆ నెంబర్లు డిలీట్ అయిపోతాయి.

ఇలా చేయడం వల్ల, మన పేరు మీద ఉండేటువంటి వాడని నెంబర్లను మనం ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు.