మహేష్ బాబు అభిమానులు.. ఆయనను అలాంటి పాత్రలో చూడగలరా ?

August 4, 2021 at 3:51 pm

మహేష్ బాబును ఆయన అభిమానులు అలాంటి పాత్రలో చూడడానికి ఇష్టపడతారా..? అంటే ఇంతకు ఆ పాత్ర ఏమిటి..? ఎందుకు ఇష్టపడరు.? ఆయన నటించబోయే పాత్రలలో అంత విశేషం ఏమిటి ..?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటివరకు మహేష్ బాబు ను లవర్ బాయ్ గా చూసిన అభిమానులు , ఒక్కసారిగా మాస్ యాంగిల్ లో లేక పౌరాణిక పాత్రలో చూసి తట్టుకోగలరా లేక ఒప్పుకోగలరా..? అనే సందేహాలు ఎంతోమంది మదిలో మెదులుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను వంటి సినిమాలలో సామాజిక సేవలను అందించే పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పటివరకు పౌరాణిక, జానపద, సాహిత్య కథల పాత్రలలో మహేష్ బాబు నటించలేదు.

మొదటిసారిగా సర్కార్ వారి పాట సినిమా లో బ్యాంకింగ్ రంగంలో మోసం చేసే ఒక క్యారెక్టర్ లో మహేష్ బాబు మనకు కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్న రామాయణం అనే సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రాముడి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నాడట మహేష్ బాబు. అయితే ఈ సినిమాలో నటించి మెప్పించినట్లయితే, మహేష్ మొదటి పౌరాణిక చిత్రంగా ఆయన సినీ కెరీర్లో మిగిలిపోతుంది.

మహేష్ బాబు అభిమానులు.. ఆయనను అలాంటి పాత్రలో చూడగలరా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts