ఇంద్ర‌భ‌వ‌నంలా మంచు ల‌క్ష్మీ ఇల్లు..ఆ రూమ్ చూస్తే కుళ్లుకుంటారు!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మీ.. మెద‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించింది. అయితే ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసినా.. హీరోయిన్‌గా క్లిక్ కాలేక‌పోయింది.

Actress Lakshmi Manchu Home Tour Video Goes Viral - Sakshi

కానీ, బుల్లితెర‌పై ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానెల్‌ను స్టార్ చేసిన మంచు లక్ష్మీ.. తాజాగా తన ఇంటి అందాలు వీడియో చేసి `మై హోమ్‌ టూర్‌` విడుదల చేసింది. వంట గది, ఆఫీస్ రూమ్‌, సినిమాలు చూసే హాల్‌, మేక‌ప్ ఇలా ఇంట్లో ఉన్న ప్రత్యేక గదులన్నింటిని ఈ వీడియోలో చూపించింది.

Lakshmi Manchu: మంచు లక్ష్మి ఇంటిని చూశారా? - lakshmi manchu my home tour  promo

అలాగే మంచు లక్ష్మి తన హ్యాండ్‌ బ్యాగ్స్‌ కలెక్షన్‌ను చూపిస్తూ.. అమ్మాయిలు ఇది చూసి కుళ్లుకుంటారు లేదా సంతోషిస్తారు అని చెప్పుకొచ్చారు. అయితే నిజంగానే మంచు లక్ష్మి చెప్పుల రూమ్ మ‌రియు హ్యాండ్ బ్యాగ్స్‌ కలెక్షన్‌ చూస్తే అమ్మాయిలు కుళ్లుకుంటారనడంలో ఎలాంటి సందేహం ఉండదేమో. మొత్తానికి ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పిస్తున్న మంచు ల‌క్ష్మీ ఇంటికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.