తను బరువు పెరగడానికి కారణం అదే అంటున్న ప్రియాంక..!

సన్నగా ఉండి.. అనుకోకుండా లావుగా మారితే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. ప్రస్తుతానికి లావుగా ఉన్న హీరోయిన్లు సన్నబడడం కోసం జిమ్ముల్లో చాలా సేపు వర్కౌట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి బాధలు ఒక హీరోయిన్ పడుతున్నది, ఆమె ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ బరువు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతుందట. అంతేకాకుండా ఒక సారి అసహనానికి కూడా గురవుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా తను అలా బరువు పెరగడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది ఈమె.Priyanka Jawalkar Went Topless to Be Remembered?

లాక్ డౌన్ సమయంలో తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయట.అవి అలా ఎందుకు అని ఆలోచించి వైద్యులను సంప్రదిస్తే.. తనకు థైరాయిడ్ ఉన్నట్లు తెలిపారని చెప్పుకొచ్చింది. ఆ కారణం చేత తను బరువు పెరగడానికి కారణం అని తెలిపింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ, జిమ్ లో కూడా వర్కౌట్లు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆహార విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపినది. ఇక అంతే కాకుండా నిజజీవితంలో ఉన్నదానికంటే కెమెరాల ముందు ఇంకా కొంచెం లావు కనిపిస్తున్నానని చెప్పుకొచ్చింది ఆమె.Priyanka Jawalkar HQ Wallpapers | Priyanka Jawalkar Wallpapers - 59027 -  Oneindia Wallpapers

ప్రస్తుతం ప్రియాంక తిమ్మరసు చిత్రంలో నటించగా అది మంచి విజయాన్ని అందుకుంది. కాకుండా ఇటీవల సరికొత్త హీరో కిరణ్ నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది . అయితే ఈ సినిమా మొదటి సారి థియేటర్లు తెరుచుకోవడంతో భారీ కలెక్షన్లను వసూలు చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఈమెకు బాగా క్రేజ్ కూడా పెరిగింది.