వాళ్లతో ప‌డుకుంటేనే ఆఫ‌ర్ల వ‌స్తాయంటున్న ప్ర‌ముఖ హీరోయిన్!

కాస్టింగ్‌ కౌచ్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి సినీ ఇండ‌స్ట్రీలో త‌మకు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను థైర్యంగా బ‌య‌ట పెడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్‌ ఫక్రీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసింది.

పదేళ్ళ కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయ‌మూర న‌ర్గీస్‌.. మొద‌టి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ త‌ర్వాత న‌ర్గీస్ స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈ అమ్మ‌డుకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఈ విష‌యంపై న‌ర్గీస్ ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. `తొలి సినిమా భారీ విజయం సాధిస్తే ఎక్కడైన హీరోహీరోయిన్లకు ఆఫ్లరు వస్తాయి. కానీ నా విషమంలో అలా జరగలేదు. బాలీవుడ్‌లో రాణించాలంటే దర్శక-నిర్మాతల కోరికలను తీర్చాల్సిందే. వాళ్లు చెప్పినట్టు చేయాలి, వాళ్ల‌కి నగ్నంగా కనిపించాలి. వాళ్ల ప‌క్క‌న ప‌డుకోవాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా దర్శక-నిర్మాతలు నన్ను కమిట్‌మెంట్ అడ‌గ‌గా.. నేను నో చెప్పాను. అది మనసులో పెట్టుకని వాళ్లు నాకు ఆఫర్స్‌ రాకుండా చేశారు` అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.